Saturday, February 22, 2020

Nuvvu Naatho Emannavo Lyrics – Disco Raja

Movie: Disco Raja
Writer: Sirivennela Seetharama Sastry
Singer: S.P.Balasubrahmanyam


నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేనీ సంగీతాన్నై నీ మనసునే తాకనా
ఏటు సాగలో అడగని ఈ గాలితో
ఎపుడాగాలో తెలియని వేగాలతో
భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా
నీలాల నీ కనుపాపలో ఏ మేఘా సందేశమో
ఈనాడిలా సావాసమై అందింది నా కోసమే
చిరునామా లేనీ లేఖంటి నా గానం చేరిందా నిన్ను ఇన్నాళ్ళకి
నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం, తీర్చేశావేమో ఈనాటికి
మౌనరాగాలు పలికే సరాగలతో
మందహసాలు చిలికే పరాగలతో
భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
నీ కురులలో ఈ పరిమళం నన్నల్లుతూ ఉండగా
నీ తనువులో ఈ పరవశం నను నేను మరిచేంతగా
రెక్కల్లా మారే దేహాల సాయంతో దిక్కుల్ని దాటి విహరించుదాం
రెప్పల్లో వాలే మోహాల భారంతో స్వప్నాలెన్నెన్నో కని, పెంచుదాం
మంచు తెరలన్నీ కరిగించు ఆవిర్లతో
హాయిగా అలిసిపోతున్నా ఆహాలతో
భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో

No comments:

Post a Comment