Saturday, February 22, 2020

Nuvvu Naatho Emannavo Lyrics – Disco Raja

Movie: Disco Raja
Writer: Sirivennela Seetharama Sastry
Singer: S.P.Balasubrahmanyam


నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేనీ సంగీతాన్నై నీ మనసునే తాకనా
ఏటు సాగలో అడగని ఈ గాలితో
ఎపుడాగాలో తెలియని వేగాలతో
భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా
నీలాల నీ కనుపాపలో ఏ మేఘా సందేశమో
ఈనాడిలా సావాసమై అందింది నా కోసమే
చిరునామా లేనీ లేఖంటి నా గానం చేరిందా నిన్ను ఇన్నాళ్ళకి
నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం, తీర్చేశావేమో ఈనాటికి
మౌనరాగాలు పలికే సరాగలతో
మందహసాలు చిలికే పరాగలతో
భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
నీ కురులలో ఈ పరిమళం నన్నల్లుతూ ఉండగా
నీ తనువులో ఈ పరవశం నను నేను మరిచేంతగా
రెక్కల్లా మారే దేహాల సాయంతో దిక్కుల్ని దాటి విహరించుదాం
రెప్పల్లో వాలే మోహాల భారంతో స్వప్నాలెన్నెన్నో కని, పెంచుదాం
మంచు తెరలన్నీ కరిగించు ఆవిర్లతో
హాయిగా అలిసిపోతున్నా ఆహాలతో
భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో

Avuno Teliyadu Kado Teliyadu lyrics

Movie: Entha Manchivaadavuraa
Writer: Sirivennela Seetharama Sastry
Singer: Shreya Ghoshal


అవునో తెలియదు కాదో తెలియదు, ఏం నవ్వో ఏమో
మొగమాటం పోదా, వయసుకు మెలకువ రాలేదా
అవునో తెలియదు కాదో తెలియదు, ఏం నవ్వో ఏమో
మొగమాటం పోదా, వయసుకు మెలకువ రాలేదా
చెలిమంటే తమరికి చేదా, తగు వరసై వస్తున్నాగా
ఒక మంచి మాట అని మంచివాడివనిపించుకో చక్కగా
వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా
వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా
అవునో తెలియదు కాదో తెలియదు, ఏం నవ్వో ఏమో
మొగమాటం పోదా, వయసుకు మెలకువ రాలేదా
కొంచెం తొలగవే తెరమరుగా
ప్రాయం త్వరపడే తరుణమిదేగా
చులకనాయనా లలల లాలల
ఏం ఎందుకు ఆ మౌనం
వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా
వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా
అవునో తెలియదు కాదో తెలియదు, ఏం నవ్వో ఏమో
మొగమాటం పోదా, వయసుకు మెలకువ రాలేదా
నాతో కలిసిరా కాదనక, నేనే నిలువునా కానుక కాగా
సహజమే కదా చిలిపి కోరిక, ఏం కాదు కదా నేరం
అవునో తెలియదు కాదో తెలియదు, ఏం నవ్వో ఏమో
మొగమాటం పోదా, వయసుకు మెలకువ రాలేదా
చెలిమంటే తమరికి చేదా, తగు వరసై వస్తున్నాగా
ఒక మంచి మాట అని మంచివాడివనిపించుకో చక్కగా
వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా
వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా
వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా
వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా

Emo Emo Ye Gundello Song Lyrics

Movie: Entha Manchivaadavuraa
Writers: D Ramajogaiah Sastry
Singer: S. P. Balasubrahmanyam


ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో
బంధువుల సంఖ్య పెంచుకుందాం
చేయందుకుందాం చిగురంత ధైర్యమై
భరోసానిద్దాం పద మనోబలమై
మనుషులం మనందరం
ఏకాకులం కాదే ఎవ్వరం
మంచితనం మన గుణం
పరస్పరం సాయం కాగలం
ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో
బంధువుల సంఖ్య పెంచుకుందాం
ఏ రక్త బంధం లేకున్నా గాని స్పందించగలిగిన స్నేహితులం
ఈ చోటి ప్రేమ ఏ చోటికైనా అందించగలిగిన వారధులం
ఓ గుండె నిప్పును ఆర్పడం ఆపడం కదా ఉపకారం
వేరెవరి హాయికో జోలాలి పాడడం ఆహా ఎంత వరం
ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఖాళీలెన్నెన్నో పుట్టించేస్తుంది
ఖాళీగా ఉండలేని కాలమిది
మనసైనదాన్ని మాయం చేస్తుంది
తప్పించుకోలేని జాలమిది
ఆ లోటు తీర్చగా ఇపుడూ ఎపుడూ మనం ముందుందాం
కష్టాల బరువును తేలికపరిచే భుజం మనమవుదాం
ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో
బంధువుల సంఖ్య పెంచుకుందాం