Saturday, February 22, 2020

Nuvvu Naatho Emannavo Lyrics – Disco Raja

Movie: Disco Raja
Writer: Sirivennela Seetharama Sastry
Singer: S.P.Balasubrahmanyam


నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేనీ సంగీతాన్నై నీ మనసునే తాకనా
ఏటు సాగలో అడగని ఈ గాలితో
ఎపుడాగాలో తెలియని వేగాలతో
భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా
నీలాల నీ కనుపాపలో ఏ మేఘా సందేశమో
ఈనాడిలా సావాసమై అందింది నా కోసమే
చిరునామా లేనీ లేఖంటి నా గానం చేరిందా నిన్ను ఇన్నాళ్ళకి
నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం, తీర్చేశావేమో ఈనాటికి
మౌనరాగాలు పలికే సరాగలతో
మందహసాలు చిలికే పరాగలతో
భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
నీ కురులలో ఈ పరిమళం నన్నల్లుతూ ఉండగా
నీ తనువులో ఈ పరవశం నను నేను మరిచేంతగా
రెక్కల్లా మారే దేహాల సాయంతో దిక్కుల్ని దాటి విహరించుదాం
రెప్పల్లో వాలే మోహాల భారంతో స్వప్నాలెన్నెన్నో కని, పెంచుదాం
మంచు తెరలన్నీ కరిగించు ఆవిర్లతో
హాయిగా అలిసిపోతున్నా ఆహాలతో
భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో

Avuno Teliyadu Kado Teliyadu lyrics

Movie: Entha Manchivaadavuraa
Writer: Sirivennela Seetharama Sastry
Singer: Shreya Ghoshal


అవునో తెలియదు కాదో తెలియదు, ఏం నవ్వో ఏమో
మొగమాటం పోదా, వయసుకు మెలకువ రాలేదా
అవునో తెలియదు కాదో తెలియదు, ఏం నవ్వో ఏమో
మొగమాటం పోదా, వయసుకు మెలకువ రాలేదా
చెలిమంటే తమరికి చేదా, తగు వరసై వస్తున్నాగా
ఒక మంచి మాట అని మంచివాడివనిపించుకో చక్కగా
వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా
వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా
అవునో తెలియదు కాదో తెలియదు, ఏం నవ్వో ఏమో
మొగమాటం పోదా, వయసుకు మెలకువ రాలేదా
కొంచెం తొలగవే తెరమరుగా
ప్రాయం త్వరపడే తరుణమిదేగా
చులకనాయనా లలల లాలల
ఏం ఎందుకు ఆ మౌనం
వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా
వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా
అవునో తెలియదు కాదో తెలియదు, ఏం నవ్వో ఏమో
మొగమాటం పోదా, వయసుకు మెలకువ రాలేదా
నాతో కలిసిరా కాదనక, నేనే నిలువునా కానుక కాగా
సహజమే కదా చిలిపి కోరిక, ఏం కాదు కదా నేరం
అవునో తెలియదు కాదో తెలియదు, ఏం నవ్వో ఏమో
మొగమాటం పోదా, వయసుకు మెలకువ రాలేదా
చెలిమంటే తమరికి చేదా, తగు వరసై వస్తున్నాగా
ఒక మంచి మాట అని మంచివాడివనిపించుకో చక్కగా
వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా
వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా
వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా
వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా

Emo Emo Ye Gundello Song Lyrics

Movie: Entha Manchivaadavuraa
Writers: D Ramajogaiah Sastry
Singer: S. P. Balasubrahmanyam


ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో
బంధువుల సంఖ్య పెంచుకుందాం
చేయందుకుందాం చిగురంత ధైర్యమై
భరోసానిద్దాం పద మనోబలమై
మనుషులం మనందరం
ఏకాకులం కాదే ఎవ్వరం
మంచితనం మన గుణం
పరస్పరం సాయం కాగలం
ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో
బంధువుల సంఖ్య పెంచుకుందాం
ఏ రక్త బంధం లేకున్నా గాని స్పందించగలిగిన స్నేహితులం
ఈ చోటి ప్రేమ ఏ చోటికైనా అందించగలిగిన వారధులం
ఓ గుండె నిప్పును ఆర్పడం ఆపడం కదా ఉపకారం
వేరెవరి హాయికో జోలాలి పాడడం ఆహా ఎంత వరం
ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఖాళీలెన్నెన్నో పుట్టించేస్తుంది
ఖాళీగా ఉండలేని కాలమిది
మనసైనదాన్ని మాయం చేస్తుంది
తప్పించుకోలేని జాలమిది
ఆ లోటు తీర్చగా ఇపుడూ ఎపుడూ మనం ముందుందాం
కష్టాల బరువును తేలికపరిచే భుజం మనమవుదాం
ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో
బంధువుల సంఖ్య పెంచుకుందాం

Saturday, June 15, 2019

Yamaha Nagari song by Veturi...


మూవీ : చూడాలని వుంది
లిరిక్స్ : వేటూరి సుందరరామ మూర్తి గారు
సింగర్ : హరిహరన్ గారు
ఇయర్ : 1998

సరిమామగారి సససనిదపసా 

రిమదానిదాప సాసనిదప మదపమరి 
యమహానగరి కలకత్తా పురి యమహానగరి కలకత్తా పురి 
నమహో హుగిలీ హౌరా వారధి యమహానగరి కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను 
మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను 
మది యమహానగరి కలకత్తా పురి 
నమహో హుగిలీ హౌరా వారధి ..


నే తాజీ పుట్టినచోట, గీతాంజలి పూసిన చోట, 

పాడనా తెలుగులో.. ఆ హంస పాడిన పాటే, 
ఆనందుడు చూపిన బాట సాగనా .. 
పదుగురు పరుగు తీసింది 
పట్నం బ్రతుకుతో వెయ్యి 
పందెం కడకు చేరాలి గమ్యం
కదలిపోరా ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల
బిజి బిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో..

యమహానగరి కలకత్తా పురి 
నమహో హుగిలీ హౌరా వారధి 
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది 
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది 
యమహానగరి కలకత్తా పురి



బెంగాలీ కోకిల బాల, తెలుగింటి కోడలుపిల్ల మానిని సరోజిని

రోజంతా సూర్యుడి కింద రాత్రంతా రజినీగంధ సాగనీ
పదుగురు ప్రేమలే లేని లోకం, దేవతా మార్కు మైకం, 
శరన్నవలాభిషేకం తెలుసుకోరా
కథలకు నెలవట 
కళలకు కొలువట 
తిథులకు సెలవట 
అతిథుల గొడవట
కలకట నగరపు కిటకటలో ..


యమహానగరి కలకత్తా పురి 

నమహో హుగిలీ హౌరా వారధి 
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను 
మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను 
మది యమహానగరి కలకత్తా పురి


వందేమాతర మే అన్న వంగ భూతలమే మిన్న జాతికే గీతిరా
మాతంగి కాళీ నిలయ చోరంగి రంగుల దునియా నీదిరా
వినుగురు సత్యజిత్రే సితార యస్ డి బర్మన్ కీ ధారా థెరీసా కీ కుమారా 
కదలిరారా జనణమనముల స్వరపద వనముల హృదయపు లయలను 
శ్రుతి పరిచిన ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో


యమహానగారి కలకత్తా పూరి 

నమహో హుగిలీ హౌరా వారధి 
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను 
మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను 
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను 
మది యమహానగారి కలకత్తా పూరి 

Thursday, April 14, 2016

Gopala Gopala...

వేగం నడిచే ఇంజిన్ లో వుండదు. నడిపే వాడి నరాల్లో వుంటుంది.

Subramanyam for Sale...

అబద్ధానికి తోడు కావాలి 
నిజానికి నీడ కూడా  అవసరం లేదు 
---------------------------------------------------------
పది మంది చేసుకునేది పండుగ కాదు 
పది మంది కలిసి చేసుకునేదే పండుగ 

Raaju Gaari Gadi...

దయ్యాన్ని చూడ్డానికి ధైర్యం అక్కర్లేదు భయం  వుంటే చాలు...  :)